భార్య ముక్కు కొరికిన భర్త..
మంచిర్యాల: అర్జున్ సమాచారం ప్రతినిధి, సెప్టెంబర్ 16.
కో టపల్లి: భార్యపై దాడి చేసిన భర్త.. అడ్డొచ్చిన భార్య ముక్కును కొరికిన ఘటన కోటపల్లి మండలంలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. కోటపల్లికి చెందిన మమతకు మల్లంపేటకు చెందిన మణిచందర్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత నాలుగేళ్లుగా అదనపు కట్నం కోసం మణిచందర్ తనను వేధిస్తున్నాడని మమత ఆరోపించినట్లు సమాచారం.
ఈ క్రమంలో పది రోజుల క్రితం మమత పుట్టింటికి వెళ్లింది. సోమవారం అత్తగారింటికి వచ్చిన మణిచందర్.. మామపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన భార్య మమత ముక్కును మణిచందర్ బలంగా కొరికినట్లు పోలీసులు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన మమతను చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం